మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 15:51:08

ఆశ్చ‌ర్యం.. బుడ్డోడి గుండు మీద సీతాకోకచిలుక‌!

ఆశ్చ‌ర్యం.. బుడ్డోడి గుండు మీద సీతాకోకచిలుక‌!

రంగురంగుల సీతాకోకచిలుక‌లంటే ఇష్టముండ‌ని వారుండ‌రు. వీటిని చూసిన‌ప్పుడ‌ల్లా ప‌ట్టుకోవాల‌నిపిస్తుంది. తీరా ప‌ట్టుకుందామ‌ని ద‌గ్గ‌ర‌కు వెళ్తే తుర్రుమ‌ని ఎగిరిపోతాయి. అలాంటిది ఓ సీతాకోక చిలుక మాత్రం ఎర్ర‌గా, బుర్ర‌గా ఉన్న బుడ్డోడు గుండు మీద వ‌చ్చి వాలింది. బాబు త‌ల‌ అటూ ఇటూ క‌దిలిస్తుంటే సీతాకోక చిలుక రెక్క‌లు క‌దిలిస్తుం‌ది. విచిత్రం ఏంటంటే.. బాబు ప‌క్క‌నే త‌ల్లి కూడా ఉంది. అయినా సీతాకోక చిలుక ఎగిరిపోలేదు. వీడియో చూస్తున్నంతసేపు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. 31 సెకండ్ల నిడివి గ‌ల ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్‌ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. క్లిప్ ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే వైర‌ల్ అయింది. దీనిని ఇప్ప‌టి వ‌ర‌కు 33.7 కే మంది వీక్షించారు. 'బాబు గుండు పువ్వులా స్వీట్‌గా ఉంద‌ని, అందుకే సీతాకోక‌చిలుక వ‌చ్చి వాలింది' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo