రూపకల్పన చేస్తున్న నాసా
న్యూఢిల్లీ, జూన్ 30: ధ్వని కంటే రెండు రెట్ల వేగంతో ప్రయాణించినా సానిక్ బూమ్ శబ్దం రాకుండా ఉండేలా నాసా ప్రయోగాత్మకంగా ఓ వాణిజ్య విమానానికి రూపకల్పన చేస్తున్నది. లాఖీద్ మార్టిన్ కంపెనీతో కలిసి దీనిని తయారు చేయనున్నది. దీనికి ఎక్స్-ప్లేన్ ప్రాజెక్టు అని పేరు పెట్టింది. సూపర్ సానిక్ విమానాలను ప్రయాణం, సరుకుల రవాణా కోసం వినియోగించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ విమానాన్ని తయారు చేస్తున్నారు. 2024 వరకు ఈ విమానం తయారవుతుందని భావిస్తున్నారు. సానిక్ బూమ్ అంటే.. విమానం వేగం ధ్వని వేగాన్ని దాటుతున్నప్పుడు గాలిలోని ధ్వని తరంగాలు బలంగా పక్కకు నెట్టబడతాయి. అప్పుడు భారీ శబ్దం వస్తుంది. ఇది ఉరుములాగా వినిపిస్తుంది. దీనినే సానిక్ బూమ్ అంటారు.