శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 26, 2020 , 16:26:11

2 నెల‌ల త‌ర్వాత వుహాన్‌లో రోడ్డెక్కిన‌ బ‌స్సులు

2 నెల‌ల త‌ర్వాత వుహాన్‌లో రోడ్డెక్కిన‌ బ‌స్సులు

హైద‌రాబాద్‌:  రెండు నెల‌ల బ్రేక్ త‌ర్వాత‌.. వుహాన్ మ‌ళ్లీ బ‌స్సు స‌ర్వీసులు ప్రారంభం అయ్యాయి.  మొత్తం 117 రూట్ల‌లో బుధ‌వారం బ‌స్సులు స్టార్ట్ అయ్యాయి.  వైర‌స్ వ్యాపించిన త‌ర్వాత తొలిసారి బ‌స్సులో ప్ర‌యాణించిన‌ట్లు ఓ ప్ర‌యాణికుడు తెలిపారు. ఇదొక కొత్త ప్ర‌యాణంగా భావిస్తానన్నాడు.  కానీ బ‌స్సులు ఎక్కేముందు స్పెష‌ల్ బోర్డింగ్ ప్రొసీజ‌ర్ పాటించాల్సి వ‌స్తుంది.  బ‌స్సులైనా, స‌బ్‌వేలైనా.. ప్యాసింజెర్లు త‌మ క్యూఆర్ కోడ్ చూపించాల్సి ఉంటుంది.  బాడీ టెంప‌రేచ‌ర్ చూసిన త‌ర్వాత కోడ్‌ను స్కాన్ చేస్తారు. ఈ ప‌ద్ధ‌తి ద్వారా ప్ర‌యాణికుల‌ను బ‌స్సు కంపెనీలు ట్రాక్ చేస్తుంటాయి. 

కానీ ప్ర‌యాణికులు మొబైల్‌లో రిజిస్ట‌ర్ చేయ‌డం అంత సులువు కాదు. వృద్ధులకు హెల్ప్ చేసేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ప్ర‌తి బ‌స్సులో సేఫ్టీ ఆఫీస‌ర్ ఉంటాడు. అత‌నే ప్ర‌యాణికుల‌కు హెల్ప్ చేస్తాడు. ప్ర‌యాణికుల డేటాను అత‌ను మెయిన్‌టేయిన్ చేయాలి. ప్ర‌తి రోజూ డ్రైవ‌ర్‌, సేఫ్టీ ఆఫీస‌ర్ హెల్త్ చెక‌ప్ చేసుకోవాలి. ఇక ప్యాసింజెర్లు కూడా మాస్కులు ధ‌రిస్తేనే బ‌స్సులోకి రావాలి. ప్ర‌స్తుతం వుహాన్‌లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న‌ది. రోడ్ల‌పై బ‌స్సుల‌ను చూసిన ప్యాసింజెర్లు.. మ‌ళ్లీ వుహాన్‌కు మంచి రోజులు వ‌చ్చాయ‌ని భావిస్తున్నారు. హుబేయ్ ప్రావిన్సులోని వుహాన్ కేంద్రంగానే క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందిన విష‌యం తెలిసిందే.  
logo