గురువారం 13 ఆగస్టు 2020
International - Jul 11, 2020 , 20:10:36

మాస్క్ పెట్టుకొమ్మంటే కొట్టి చంపారు!

మాస్క్ పెట్టుకొమ్మంటే కొట్టి చంపారు!

హైద‌రాబాద్‌: ఫ‌్రాన్స్‌లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మాస్క్ పెట్టుకొమ్మని చెప్పినందుకు ముగ్గురు ప్ర‌యాణికులు క‌లిసి ఒక బ‌స్ డ్రైవ‌ర్‌ను కొట్టిచంపారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్‌కు చెందిన 59 ఏండ్ల‌ ఫిలిప్పే మంగీల్లాట్ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మాస్క్ తప్పనిసరిగా ధ‌రించాల‌నే ఆదేశాలు అమ‌ల్లో ఉండ‌టంతో బయోన్నె ప్రాంతంలో మాస్క్ లేకుండా బస్ ఎక్కిన ముగ్గురు ప్రయాణికులను ఫిలిప్పే మాస్క్ ధరించాలని కోరాడు. 

అయితే, ఫిలిప్పే సూచ‌న‌ను వారు లెక్క‌చేయ‌లేదు. దీంతో ఆ ముగ్గురు ప్రయాణికులను బస్ దిగాలని కోరాడు. దాంతో ఆగ్రహానికిలోనైన ఆ ముగ్గురు ప్రయాణికులు ఫిలిప్పేపై దాడికి దిగారు. ఈ దాడిలో ఫిలిప్పే తీవ్రంగా గాయప‌డి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో మిగ‌తా ప్ర‌యాణికులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫిలిప్పేను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు తెలిపారు. 

కాగా, ఫిలిప్పేపై దాడికి పాల్ప‌డిన ముగ్గురు ప్రయాణికులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo