సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 06, 2020 , 18:04:46

మాస్కు వేసుకోమన్నందుకు బస్సు డ్రైవర్‌ను కొట్టి చంపారు..

మాస్కు వేసుకోమన్నందుకు బస్సు డ్రైవర్‌ను కొట్టి చంపారు..

పారిస్‌ : ఫ్రాన్స్‌లోని బయోన్నేలో మాస్కు లేకుండా నలుగురు వ్యక్తులు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న డ్రైవర్‌ను చితకబాది చంపేశారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్‌ అంతటా మాస్కు తప్పనిసరి చేసిన నేపథ్యంలో నలుగురు వ్యక్తులు ఆదివారం రాత్రి టిక్కెట్లు, మాస్కులు లేకుండా బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు. అయితే 50 ఏండ్ల బస్సు డ్రైవర్‌ ‘‘మాస్కు తప్పనిసరి అని, మాస్కు లేనిదే బస్సులోకి  అనుమతించమ’’ని వారిని అడ్డుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తులు డైవర్‌పై విచక్షణారహితంగా దాడిచేశారు. అతడి మెదడు ప్రాంతంలో పదే పదే పిడిగుద్దులు కురిపించడంతో అతడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే స్థానికులు డ్రైవర్‌ను దవాఖానకు తరలించగా చికిత్స పోందుతూ బ్రెయిన్‌ డెడ్‌తో సోమవారం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, దాడిచేసిన వారిలో ఒక వ్యక్తి తమ అదుపులో ఉన్నాడని, మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణమైన దాడికి నిరసనగా డ్రైవర్ సహోద్యోగుల్లో చాలామంది విధుల్లోకి రాకపోవడంతో సోమవారం ప్రాంతీయ బస్సు సర్వీసులు నడువలేదు. 


logo