బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 18:35:10

భౌతిక దూరం పాటించేందుకు స్పేస్‌ బబూల్స్‌.. వావ్‌ వాటెన్‌ ఐడియా!

భౌతిక దూరం పాటించేందుకు స్పేస్‌ బబూల్స్‌.. వావ్‌ వాటెన్‌ ఐడియా!

న్యూయార్క్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనాను ఎదుర్కొనే టీకా ఇప్పటిదాకా రాలేదు. మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం ఇప్పుడివే మనముందున్న మార్గాలు. అలాగే, కరోనా లాక్‌డౌన్‌ వల్ల చాలా వ్యాపారలు దెబ్బతిన్నాయి. అందులో రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్‌లు కూడా ఉన్నాయి. ఆంక్షలు సడలించడంతో అవి ఇప్పుడిప్పుడే తిరిగి తెరుచుకుంటున్నాయి. అయితే, ప్రజలు ఎక్కువగా వచ్చేందుకు జంకుతుండడంతో భౌతిక దూరం పాటించేందుకు వినూత్న పద్ధతులను పాటిస్తున్నాయి. అమెరికాలోని ఓ కేఫ్‌ బబూల్‌ విధానంతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 

 న్యూయార్క్ నగరంలోని ఒక ప్రసిద్ధ ‘కేఫ్ డు సోలైల్’ అనే బిస్ట్రో ఈ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఆరుబయట ఏడు అడుగుల పొడవులో స్పేస్‌ బబూల్స్‌ ఏర్పాటు చేసింది. ఒక్కో దానిలో ఆరుగురు కూర్చోవచ్చు. మొత్తం 80 మంది అతిథులు ఇక్కడ ఒకేసారి భోజనం చేయవచ్చు. దీనికి సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా, వైరల్‌ అయ్యాయి. వావ్‌ వాటెన్‌ ఐడియా అంటూ నెటిజన్లు ప్రశంజల జల్లు కురిపిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo