బుధవారం 21 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 19:25:18

పాదాలతో బాణాలు వేయడంలో ఈమె దిట్ట

పాదాలతో బాణాలు వేయడంలో ఈమె దిట్ట

లండన్‌ : మనం చూసే విలువిద్యలో సాధారణంగా చేతులతో బాణాలు వేస్తుంటారు. అయితే పాదాలతో బాణాలను గురిచూసి ప్రయోగించడం చూస్తే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. రెండు చేతులను రెండు పోల్స్‌పై ఉంచి కాళ్లతో విల్లును ఎక్కుపెట్టడంలో ఈ యువతి కొత్త రికార్డులు నమోదుచేసింది. పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ద్వారా ఎక్కువ దూరం రికార్డును అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ ఆర్గానిక్‌కు చెందిన బ్రిట్నీ వాల్ష్ సాధించింది.

2018 మార్చి 31న బ్రిట్నీ తన రెండు చేతులను పోల్‌పై ఉంచి.. తల పైనుంచి బాణాలు సంధించింది. ఈమె 40.4 అడుగుల దూరంలో ఉన్న 5.5-అంగుళాల సర్కిల్‌ను లక్ష్యంగా చేసుకుని గిన్నిస్ పుస్తకంలో తన పేరును నమోదు చేసుకున్నది. కఠినమైన శిక్షణ, ఏకాగ్రత, సమతుల్యతతో సౌకర్యవంతమైన శరీరాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అని బ్రిట్నీ చెప్పారు. కొంతకాలంగా బ్రిట్నీ.. ప్లానెట్ హాలీవుడ్, లాస్ వెగాస్‌లోని ది వెనీషియన్స్‌లో ప్రదర్శన ఇస్తున్నది. 2012 లో అర్జెంటీనాకు చెందిన క్లాడియా గోమెజ్ 18 అడుగుల లక్ష్యంతో రికార్డు సృష్టించారు. 2014 లో కాలిఫోర్నియాకు చెందిన నాన్సీ సిప్కర్ పాత రికార్డును బద్దలు కొట్టి 20 అడుగుల దూరం లక్ష్యంగా కొత్త రికార్డు సృష్టించింది. నాన్సీ మంగోలియా వెళ్లి మంగోల్ ప్రజల నుంచి విన్యాసాలు నేర్చుకున్నారు.logo