షాపింగ్ మాల్స్‌కు పరుగోపరుగు.. ‘స్ట్రెయిన్’పై ఆందోళన

లండన్: బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ ‘స్ట్రెయిన్’ వెలుగు చూడటంతో ఆ దేశ పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై వివిధ దేశాలు ఆంక్షలు విధించడంతో నిత్యావసర వస్తువుల సరఫరా కొరత తలెత్తుతుందేమోనన్న భయంతో చివరిక్షణంలో ప్రజలు తమ ప్లాన్లను మార్చేసుకున్నారు.
మరో రెండు రోజుల్లో క్రిస్మస్ పండుగ జరుపుకోవాల్సి ఉన్న తరుణంలో న్యూ స్ట్రెయిన్ వెలుగు చూడటంతో అంతా సరుకుల కోసం షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్‌లకు పరుగెత్తుతున్నారు. ఇప్పటికే పలు మార్కెట్ల వద్ద జనం బారులు తీరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.
ఇప్పటికే కరోనా వేడుకలను నిర్వహించుకోవడానికి సిద్ధమైన ప్రజలు తమ కుటుంబాలను చూసుకునేందుకు లండన్ వీడాలని ముందుగా అనుకున్నా కానీ కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో వారి ప్లాన్లు మారిపోయాయి. సంప్రదాయంగా బ్రిటన్‌లో క్రిస్మస్ పండుగ సందర్భంగా టెస్కో, సైన్స్బర్రీస్, వెట్రోజ్, మార్క్స్ అండ్ స్పెన్సర్, అడ్డీ, లిడ్ల్ వంటి షాపింగ్ మాల్స్ బిజీబిజీగా ఉంటాయి.
కానీ ప్రజల కదలికలపై ప్రధాని బోరిస్ జాన్సన్ ఆంక్షలు విధించడంలో ప్రజలంతా క్రిస్మస్ వేడుకల నిర్వహణకు అవసరమైన కేక్‌లు, బేకరి ఫుడ్స్ తయారీ సామగ్రి, తమ కుటుంబానికి అవసరమైన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు పరుగులు తీశారు. పలు షాపింగ్ మాల్స్‌లో మీట్, మిల్క్ అమ్ముడైనా బేక్డ్ బీన్స్ పాస్టా వంటి వస్తువులు విరివిగానే లభిస్తున్నాయి. ‘గ్రేట్ బ్రిటన్ క్రిస్మస్ లంచ్’కు అవసరమైన అన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని సైన్స్బర్రీస్ తెలిపింది. జాన్సన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రజలు సాధారణంగానే షాపింగ్ చేయొచ్చునని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు