గురువారం 28 మే 2020
International - Apr 10, 2020 , 11:57:32

ఐసీయూ నుంచి బయటకు వచ్చిన బ్రిటన్ ప్రధాని

ఐసీయూ నుంచి బయటకు వచ్చిన బ్రిటన్ ప్రధాని

హైదరాబాద్: కరోనా వైరస్ సోకిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడురోజుల అనంతరం ఐసీయూ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయనకు సాధారణ వార్డులో చికిత్స జరుగుతున్నట్టు 10-డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం తెలిపింది. జాన్సన్‌కు  కరోనా తగ్గుముఖం పడుతున్నదని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వివరించింది. కరోనా మహమ్మారి సోకిన ప్రభుత్వాధినేతగా ఆయన రికార్డు సృష్టించారు. కెనడా ప్రధాని భార్యకు, ఇరాన్ స్పీకర్‌కు.. ఇలా ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు కరోనా సోకింది.


logo