శనివారం 28 నవంబర్ 2020
International - Oct 21, 2020 , 21:38:14

తక్కువ జీతం ఇస్తున్నారు.. అందుకే రాజీనామా చేస్తున్నా

తక్కువ జీతం ఇస్తున్నారు.. అందుకే రాజీనామా చేస్తున్నా

రాజకీయ నాయకులు జీతం గురించి అస్సలే ఆలోచించరని మనకు తెలుసు. మన దేశంలోనైతే జీతాన్ని ఏదో ఒక సంస్థకు విరాళంగా ఇచ్చేస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే తనకిచ్చే జీతం తక్కువగా ఉంటున్నందున బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నాడంట బోరిస్‌ జాన్సన్‌. మరో ఆరు నెలల తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం.

బ్రిటన్‌ దినపత్రిక 'ది డైలీ మిర్రర్' ప్రకారం.. బోరిస్‌ జాన్సన్ సుమారు 1,95,000 డాలర్లు (1,50,400 పౌండ్లు) సంపాదిస్తాడు. బ్రెక్సిట్ పూర్తయిన వెంటనే కార్యాలయాన్ని విడిచిపెట్టి రాజీనామా చేయాలని, కరోనా వైరస్ మహమ్మారి అంతమైన తర్వాత దేశాన్ని చుట్టిరావాలని యోచిస్తున్నాడట. తన మునుపటి వృత్తితో పోల్చితే కూడా తన జీతం తక్కువగా ఉన్నదని ప్రధానమంత్రి అనుకుంటున్నట్లు కొంతమంది పేరులేని టోరీ పార్టీ ఎంపీలు భావిస్తున్నారు. "బోరిస్‌కు ఆరుగురు పిల్లలు ఉన్నారు. కొంతమంది ఆర్థిక సహాయం అవసరమయ్యే చిన్నవారు ఉన్నారు" అని టాబ్లాయిడ్ ఒక ఎంపీని ఉటంకిస్తూ తెలిపింది. "అతను విడాకుల ఒప్పందంలో భాగంగా మాజీ భార్య మెరీనా వీలర్‌కు చాలా పెద్దమొత్తంలో చెల్లించాల్సి వచ్చింది" అని తెలిపింది. బ్రెక్సిట్ ఒప్పందం తిరస్కరించబడిన తరువాత రాజీనామా చేసిన తన ముందున్న థెరిసా మేను దాటలేనని జాన్సన్ అభిప్రాయపడ్డాడని కూడా వ్యాసం సూచించింది. గత సంవత్సరం ప్రధాని పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి లెక్చర్ సర్క్యూట్లో మిలియన్ పౌండ్లు (దాదాపు 11,75,695 డాలర్లు) సంపాదించిన థెరిసా మేపై జాన్సన్ అసూయపడ్డాడు. అంతకు రెట్టింపు సంపాదించగలనని జాన్సన్‌ నమ్ముతున్నాడంట.

టోరీ పార్టీ నాయకుడిగా మారడానికి ముందు.. బోరిస్‌ జాన్సన్‌ రోజువారీ టెలిగ్రాఫ్ కాలమిస్ట్‌గా సంవత్సరానికి 3,55,584 డాలర్ల జీతంలో ఉన్నారు. రెండు ప్రసంగాలు ఇవ్వడం ద్వారా నెలలో 2,06,885 డాలర్లు సంపాదించారు. "బోరిస్ విలక్షణమైన వ్యభిచారి. బహుమతి కంటే చేజ్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు" అని మరో ఎంపీ వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వ అధిపతి కావడానికి కొద్దిసేపటి ముందు ఒక నెలలో కేవలం రెండు ఉపన్యాసాలలో 2,06,885 డాలర్లు సంపాదించినందున బ్రిటిష్ ప్రధాని కనీసం రెట్టింపు సంపాదించగలరని నమ్ముతున్నట్లు ఎంపీలు చెప్పారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.