పారిస్: బ్రిటీష్ మత్స్యకారుడు ఆండీ హాకెట్ సుమారు 31 కేజీల గోల్డ్‌ఫిష్‌ను పట్టాడు. ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్‌ఫిష్ చేపగా రికార్డు అయ్యింది. ఆ చేపకు ద క్యారెట్ అన్న నిక్ నేమ్ ఉంది. గతంలో అమెరికాలోని మిన్నసొట్టాలో దొరికిన గోల్డ్‌ఫిష్ కన్నా ఇది సుమారు 14 కేజీల ఎక్కువ బరువు ఉంది. ఫ్రాన్స్‌లోని చాంపేన్‌లో ఉన్న బ్లూవాటర్ సరస్సులో ఆండీ వలకు ఈ చేప చిక్కింది. లెదర్ కార్ప్, కోయి కార్ప్ కు చెందిన హైబ్రిడ్ రకమే ఈ భారీ చేప. దాదాపు 25 నిమిషాల వేట తర్వాత ఆండీకి గోల్డ్‌ఫిష్ దొరికింది.