శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 02, 2020 , 14:57:24

36 వేల మంది ఉద్యోగుల‌పై స‌స్పెన్ష‌న్‌..

36 వేల మంది ఉద్యోగుల‌పై స‌స్పెన్ష‌న్‌..

హైద‌రాబాద్‌: బ్రిటీష్ ఎయిర్‌వేస్ భారీ సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తాత్కాలికంగా తొల‌గించ‌నున్న‌ది. సుమారు 36 వేల మంది ఉద్యోగుల‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఆ సంస్థ భావిస్తున్న‌ది. దీనిపై ఆ కంపెనీ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలుబ‌డించ‌నున్న‌ది. క‌రోనా సంక్షోభం వ‌ల్ల ఆ కంపెనీకి చెందిన దాదాపు అన్ని విమానాలు గ్రౌండ్ అయి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో యునైట్ యూనియ‌న్‌తో బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఓ ఒప్పందం కుద‌ర్చుకోనున్న‌ది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్‌, ఇంజినీర్లు, హెడ్ ఆఫీసులో ప‌నిచేసే దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల వ‌ర‌కు విధుల నుంచి స‌స్పెండ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఎయిర్‌వేస్ నిర్ణ‌యం వ‌ల్ల ఉద్యోగాలు కోల్పోయేవారు.. ప్ర‌భుత్వ స్కీమ్ నుంచి బెనిఫిట్ పొంద‌నున్నారు. వారికి నెల‌కు 2500 పౌండ్లు ఇవ్వ‌నున్నారు.


logo