శనివారం 30 మే 2020
International - Apr 06, 2020 , 09:37:47

త‌గ్గ‌ని క‌రోనా.. ఆస్ప‌త్రికి బ్రిట‌న్ ప్ర‌ధాని

త‌గ్గ‌ని క‌రోనా.. ఆస్ప‌త్రికి బ్రిట‌న్ ప్ర‌ధాని

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్ గ‌త వారం రోజులుగా హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నా కరోనా ల‌క్ష‌ణాలు త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారం క్రితం క‌రోనా పాజ‌టివ్‌గా తేల‌డంతో అప్ప‌టి నుంచి ఆయ‌న త‌న నివాసంలోనే క్వారెంటైన్‌లో ఉండి చికిత్సి పొందుతున్నారు. అయ‌నా క‌రోనా ల‌క్ష‌ణాలు పూర్తిగా త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు బ్రిట‌న్ ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించారు. బోరిస్ వ్య‌క్తిగ‌త వైద్యుడి సూచ‌న మేర‌కే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 

మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై బోరిస్ జాన్స‌న్ ఒక‌ వీడియోలో వెల్లడించారు. త‌న ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అయితే స్వ‌ల్పంగా వైరస్‌ లక్షణాలు ఉన్నాయ‌ని ఆ వీడియోలో తెలిపారు. ఇప్ప‌టికీ బాడీ టెంప‌రేచ‌ర్‌ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించార‌ని, ప్రభుత్వ నింబంధనల ప్రకారం క‌రోనా లక్షణాలు పూర్తిగా త‌గ్గేవ‌రకు తాను క్వారెంటైన్‌లోనే ఉంటాన‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని చెప్పారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo