శనివారం 06 జూన్ 2020
International - May 03, 2020 , 09:21:15

వైద్యుల రుణం తీర్చుకున్న బ్రిటన్ ప్రధాని

వైద్యుల రుణం తీర్చుకున్న బ్రిటన్ ప్రధాని

లండ‌న్:‌ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి చికిత్స అనంత‌రం కోలుకున్నారు. బిడ్డ పుట్టడానికి కొన్నిరోజుల‌ ముందే కరోనాతో పోరాడి మృత్యువును జ‌యించాడు.  మృత్యు ఒడిలోకి వెళ్లిన త‌న‌కు వైద్యం చేసిన కాపాడిన డాక్ట‌ర్స్ రుణం తీర్చుకున్నారు బోరిస్ జాన్స‌న్. ఇటీవ‌లే పుట్టిన‌‌ కుమారుడికి త‌న‌కు వైద్యం అందించిన‌ డాక్ట‌ర్స్ పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని భార్య సీమండ్స్ సోష‌ల్ మీడియా ద్వారా  వెల్లడించారు. డాక్టర్లతోపాటు తమ పూర్వీకులు పేర్లు కలిసి వచ్చేలా విల్‌ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని నామకరణం చేసినట్టు పేర్కొన్నారు. 

బోరిస్ తాత విల్‌ఫ్రెడ్.. సీమండ్స్ తాత లౌరీ.. జాన్సన్‌కు ట్రీట్మెంట్ అందించిన‌ వైద్యులు నిక్ ప్రైస్, నిక్ హర్ట్.. ఇలా నలుగురి పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి పెట్టినట్టు వివరించారు. సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్‌ హెల్త్ స్టాఫ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయ‌న అన్నారు. వారి సేవ‌ల‌కు కేవ‌లం థ్యాంక్స్ మాత్రమే స‌రిపోద‌ని, ఆస్ప‌త్రి సిబ్బందే త‌న ప్రాణాల‌ను కాపాడార‌ని అన్నారు. అన్నట్టుగా థ్యాంక్స్‌తోనే ఆగిపోకుండా తన బిడ్డకు వైద్యుల పేరునే పెట్టి రుణం తీర్చుకున్నారు.


logo