బుధవారం 03 జూన్ 2020
International - Apr 07, 2020 , 16:56:42

బ్రిట‌న్ ప్ర‌ధాని త్వ‌ర‌గా కోలుకోవాలి, ఇవాంకా ట్రంప్ ఆకాంక్ష‌

బ్రిట‌న్ ప్ర‌ధాని త్వ‌ర‌గా కోలుకోవాలి, ఇవాంకా ట్రంప్ ఆకాంక్ష‌

లండ‌న్: క‌రోనా వైర‌స్ బారిన ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని  అమెరికా ప్రెసిడెంట్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఆకాంక్షించారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. బోరిస్ జాన్స‌న్ ఆరోగ్యం మెరుగ‌ప‌డి,  త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మార్చి 27 న బోరిస్ జాన్స‌న్‌కు క‌రోనా సోకింద‌ని తేల‌డంతో ఆయ‌న స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. క‌రోనా వ‌చ్చిన‌ట్లు స్వ‌యంగా ప్ర‌కటించిన ఆయ‌న‌...ఇంటి నుంచే ప‌రిపాల‌న వ్య‌వ‌హారాలు చూసుకున్నారు. ఈ నేప‌థ్యంలో వ్యాధి మ‌రింత తీవ్రం కావ‌డంతో ఆయ‌న‌ను  ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అయితే  ప్ర‌ధాని జాన్సన్ ఆరోగ్యం నిలకడ గానే ఉందని వైద్యులు వెల్ల‌డించారు. మొత్తంగా బ్రిట‌న్‌లో 51,608 కేసులు న‌మోదు కాగా 5,373 మంది ప్రాణాలు కోల్పోయారు.


logo