బుధవారం 27 మే 2020
International - Apr 08, 2020 , 00:57:02

ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని

ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని

లండన్‌: కరోనా లక్షణాలతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ దవాఖానా ఐసీయూలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ దేశ ప్రధాని కార్యాలయం మంగళవారం తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బోరిస్‌ను దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొంది. కరోనా లక్షణాల తీవ్రత పెరుగడంతో బోరిస్‌ జాన్సన్‌ (55) సోమవారం లండన్‌లోని ఓ దవాఖాన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమమైంది. అయితే, బోరిస్‌ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నదని అధికారిక ప్రకటన వెలువడింది. బోరిస్‌ కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీతోపాటు వివిధ దేశాల అధినేతలు ఆకాంక్షించారు. 


logo