బుధవారం 27 జనవరి 2021
International - Jan 09, 2021 , 15:43:54

ఇకపై పిలలు కూడా గూఢచర్యం చేయొచ్చు! ఎక్కడంటే..

ఇకపై పిలలు కూడా గూఢచర్యం చేయొచ్చు! ఎక్కడంటే..

లండన్‌ : గూఢచర్యం చట్టంలో బ్రిటిష్ ప్రభుత్వం పెను మార్పులు తీసుకొచ్చింది. బ్రిటన్‌ గూఢచర్యం చట్టంలో సవరణలు చేయడంతో ఇకపై పిల్లలను కూడా రహస్య ఏజెంట్లుగా నియమించుకోవచ్చు. ప్రభుత్వ సంస్థలు, మిలటరీ, జూదం రెగ్యులేటర్ కూడా పిల్లలను గూఢచారులుగా ఉపయోగించుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా పిల్లలను తల్లిదండ్రులకు వ్యతిరేకంగా గూఢచారులుగా పెట్టుకోవచ్చు. కొత్త చట్టం ప్రకారం, ప్రత్యేక పరిస్థితుల్లో సైన్యం, పోలీసులు మాత్రం 18 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై నిఘా పెట్టొచ్చు.

గూఢచర్యం చట్టంలో మార్పులు తీసుకురావడంతో ప్రభుత్వ సంస్థలు పిల్లలను అండర్ కవర్ ఏజెంట్లుగా ఉపయోగించుకోవచ్చు. పోలీసులు, ఎంఐ-5, ఎంఐ-6, నేషనల్ క్రైం ఏజెన్సీ, గ్యాంబ్లింగ్‌ కమిషన్, కౌంటీ, జిల్లా కౌన్సిల్, ఎన్విరా‌న్‌మెంట్‌ ఏజెన్సీ, ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీలు.. పిల్లలను ప్రత్యేకంగా డిటెక్టివ్‌లుగా నియమించగల సంస్థల్లో ఉన్నాయి. 16 ఏండ్లలోపు పిల్లలను వారి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా గూఢచర్యం చేయడానికి మాత్రం అనుమతించడం లేదు. గతంలో ఈ బిల్లును పలు కారణాలతో పలువురు విమర్శించారు. 

అరుదైన పరిస్థితుల్లోనే..

పిల్లలను డిటెక్టివ్‌గా ఉపయోగించడం గురించి చాలా అరుదైన పరిస్థితుల్లో మాత్రమే పిల్లలను గూఢచర్యం చేయించేందుకు అంగీకరిస్తామని యూకే చిల్డ్రన్‌ కమిషనర్‌ అన్నే లాంగ్‌ఫీల్డ్‌ చెప్పారు. ఏ ఒక్క యువకుడికి చంపేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్లు గూఢచర్యంలో పెట్టుకోమని రక్షణ మంత్రి జేమ్స్ బ్రోకెన్‌చర్‌ గత అక్టోబర్‌లోనే వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

ఒకే పెండ్లి మండపం.. ఇద్దర్ని పెండ్లాడిండు..

అమెరికా మా బద్ద శత్రువు.. అధ్యక్షుడు మారితే మా విధానాలు మారవు

మహాత్ముడు తిరిగొచ్చాడు..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo