గురువారం 09 జూలై 2020
International - Jun 28, 2020 , 06:35:27

బ్రిటన్‌ ‘స్కిప్పింగ్‌ సిక్కు’కు సమాజసేవ అవార్డు

బ్రిటన్‌ ‘స్కిప్పింగ్‌ సిక్కు’కు సమాజసేవ అవార్డు

లండన్‌ : బ్రిటన్‌కు చెందిన ‘స్కిప్పింగ్‌ సిక్కు’ రాజీందర్‌ సింగ్‌ను ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పాయింట్స్‌ ఆఫ్‌ లైట్‌ అవార్డుతో సత్కరించారు. బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ సమయంలో పేదలను ఆదుకునేందుకు విరాళాల సేకరణ కోసం 73 ఏండ్ల వయసున్న రాజీందర్‌ సింగ్‌ స్కిప్పింగ్‌ చేస్తూ ఆ వీడియోలను విడుదల చేశారు. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. యూట్యూబ్‌లో 2.50 లక్షల మందికి పైగా చూశారు. దీంతో రూ.11లక్షలకు పైగా నిధులు సమకూరాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు అవార్డును అందించారు. రాజీందర్‌ వీడియోల వల్ల ఎంతోమంది ఆరోగ్య స్పృహను పెంచుకున్నారని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.logo