గురువారం 04 జూన్ 2020
International - May 09, 2020 , 16:30:52

14 రోజుల స్వీయ నిర్బంధం తప్పనిసరి

14 రోజుల స్వీయ నిర్బంధం తప్పనిసరి

లండన్‌: తమ దేశానికి వచ్చే విదేశీయులైనా, స్వదేశీయులైనా తప్పనిసరిగా 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలనే నిబంధను బ్రిటన్‌ ప్రవేశపెట్టనుంది. యూరప్‌లో కరోనా వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో బ్రిటన్‌ ఒకటి. దీంతో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి విదేశాల నుంచి వచ్చే ప్రతిఒక్కరు తప్పనిసరిగా స్వీయ నిర్బంధంలో ఉండాలని షరతు విధించాలని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం జరగనున్న మంత్రిమండలి సమావేశం అనంతరం జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. 

కాగా, ఇప్పటికే కరోనా మహమ్మారితో బ్రిటన్‌ విమానయాన సంస్థలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ 14 రోజుల స్వీయ నిర్బంధ నిబంధనతో ప్రయాణికులు ఆలోచనలో పడే అవకావం ఉందని విమానయాన సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 

బ్రిటన్‌లో ఇప్పటివరకు 2,11,364 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 31,241 మంది బాధితులు మరణించారు.


logo