శనివారం 30 మే 2020
International - Mar 27, 2020 , 17:55:16

బ్రిట‌న్ ప్ర‌ధానికి క‌రోనా.. స్వీయ నిర్బంధంలో జాన్సన్‌

బ్రిట‌న్ ప్ర‌ధానికి క‌రోనా.. స్వీయ నిర్బంధంలో జాన్సన్‌


హైద‌రాబాద్‌: బ్రిట‌న్ ప్ర‌దాని బోరిస్ జాన్స‌న్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. క‌రోనా పరీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. గ‌త 24 గంట‌ల్లో శ‌రీరంలో కొద్దిగా టెంప‌రేచ‌ర్ పెరిగింద‌ని, ప‌దేప‌దే ద‌గ్గు రావ‌డం వ‌ల్ల‌.. డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  అయితే చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ స‌ల‌హా మేర‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాని, దాంట్లో పాజిటివ్‌గా తేలిన‌ట్లు ఆయ‌న తెలిపారు. పాజిటివ్ రావ‌డంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాన‌ని,  ఇంటి నుంచే ప‌నిచేస్తున్న‌ట్లు ప్ర‌ధాని జాన్స‌న్ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు. 


logo