లండన్, జూన్ 26: తన కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని ముద్దు పెట్టుకున్న బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాన్కాక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఫొటోలు ఓ పత్రికలో ప్రచురితం కావడంతో వివాదం రేగింది. ఆయన ఆఫీసులో అలా వ్యవహరించి కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలకు క్షమాపణ చెప్పిన ఆయన శనివారం తన పదవికి రాజీనామా చేశారు. హాన్కాక్ రాజీనామాపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విచారం వ్యక్తం చేశారు.