శనివారం 06 జూన్ 2020
International - May 09, 2020 , 20:16:03

బ్రిడ్జి ఎక్కండి.. ఊయల ఊగండి!

బ్రిడ్జి ఎక్కండి.. ఊయల ఊగండి!

చిన్న‌ప్పుడు ఉయ్యాలు ఊగ‌లేద‌ని బాధ‌ప‌డేవారు ఈ బ్రిడ్జిని సంద‌ర్శించండి. దీనిపైన ప్ర‌యాణం చేస్తే స‌రిపోతుంది. అదే ఉయ్యాలు ఊపుతుంది. ఎవ‌రి సాయం అవ‌స‌రం లేదు. సాధార‌ణంగా వంతెన మీద క‌దులుతున్న‌ట్లు అనిపించ‌డం స‌హ‌జం. భూకంపాల‌కు త‌ట్టుకునే విధంగా వంతెన‌ల‌కు క‌డుతారు ఇంజినీర్లు. కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం ఏకంగా ఉయ్యాలే ఊపేస్తుంది. దక్షిణ చైనా‌లోని గాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న హ్యూమెన్‌ బ్రిడ్జి ఒక్కసారిగా ఊగడంతో వాహనదారులు హడలిపోయారు. ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని ఎలాగోలా వంతెన దాటేస్తున్నారు, 

జ‌నాల‌ను హ‌డెలెత్తిస్తున్న ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం విచార‌ణ మొద‌లుపెట్టింది. అయితే ఈ వంతెన ఎప్పుడూ ఊగ‌ద‌ట‌. ఈదురు గాలులు వీచిన‌ప్పుడు మాత్ర‌మే ఊగుతుంద‌ట‌. అంతేకాదు ఈ వంతెన వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.logo