ఆదివారం 12 జూలై 2020
International - May 27, 2020 , 22:28:22

బ్రిక్స్‌ బ్యాంక్‌ అధ్యక్షుడిగా ట్రాయ్జో

బ్రిక్స్‌ బ్యాంక్‌ అధ్యక్షుడిగా ట్రాయ్జో

బీజింగ్‌: బ్రిక్స్‌ దేశాల కొత్త అభివృద్ది బ్యాంకు అధ్యక్షుడిగా బ్రెజిల్‌కు చెందిన ఆర్థిక మంత్రి మార్కోస్‌ ప్రాడో ట్రాయ్జో నియమితులయ్యారు. ఉపాధ్యక్షుడిగా భారత్‌కు చెందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన అనిల్‌ కిషోరా నియామకం కూడా ఖరారైంది. బ్రిక్స్‌ దేశాల బ్యాంకు అధ్యక్షుడిగా ఇటీవలి వరకు ఇండియాకు చెందిన ప్రముఖ బ్యాంకర్‌ కేవీ కామత్‌ సేవలందించారు. బీజింగ్‌లో బుధవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. 

ప్రస్తుతం బ్రెజిల్‌ ఆర్థిక మంత్రిగా సేవలందిస్తున్న మార్కోస్‌ ప్రాడో ట్రాయ్జో.. మొన్నటి వరకు బ్రెజిల్‌ డిప్యూటీ ఎకానమీ మినిస్టర్‌గా పనిచేశారు. అలాగే, బ్రెజిల్ ప్రభుత్వానికి ఫారిన్‌ ట్రేడ్‌, అంతర్జాతీయ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా కూడా సేవలందించారు. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రీకా దేశాలు కలిసి బ్రిక్స్‌గా ఏర్పడి ఎన్డీబీని 2015లో 100 బిలియన్‌ డాలర్ల క్యాపిటల్‌తో ఏర్పాటుచేసుకొన్నాయి. బ్రిక్స్‌ దేశాల్లో మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు కావాల్సిన వనరులను సమీకరించుకొనేందుకు ఈ బ్యాంకును నెలకొల్పారు. చైనాలోని షాంఘై ప్రధాన కేంద్రంగా బ్రిక్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయి. 


logo