సోమవారం 18 జనవరి 2021
International - Dec 27, 2020 , 00:57:36

జనవరి 1 నుంచి బ్రెగ్జిట్‌ అమలు

జనవరి 1 నుంచి బ్రెగ్జిట్‌ అమలు

బ్రస్సెల్స్‌: యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి విడిపోతూ బ్రిటన్‌ కుదుర్చుకున్న (బ్రెగ్జిట్‌) ఒప్పందం 2021 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నది. సుదీర్ఘంగా సాగిన చర్చల అనంతరం ఇటీవలే భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. 1,240 పేజీలున్న ఈ ఒప్పంద ప్రతిని బ్రిటన్‌, ఈయూ ప్రతినిధులు శనివారం ప్రజల ముందుకు తీసుకొచ్చారు. బ్రెగ్జిట్‌ తర్వాత కూడా ఈయూలోని 27 దేశాల్లో బ్రిటన్‌ తన వస్తుసేవలను స్వేచ్ఛగా విక్రయించుకొనేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తున్నది.