శనివారం 30 మే 2020
International - Apr 26, 2020 , 17:01:27

వ‌క్షోజాలే ఆమెను ర‌క్షించాయ‌ట‌!

వ‌క్షోజాలే ఆమెను ర‌క్షించాయ‌ట‌!

న్యూఢిల్లీ: ముప్పై ఏండ్ల ఒక‌ ఓ మ‌హిళ రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న‌ది. సెల్‌ఫోన్ చూసుకుంటూ వెళ్తున్న ఆమె ముందు అక‌స్మాత్తుగా ఒక ఆగంత‌కుడు తుపాకీతో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. దీంతో ఒక్క‌సారిగా షాక్‌కు గురైన ఆమె తేరుకునేలోపే అత‌డు ఆమె ఛాతీ ఎడ‌మ భాగంలో షూట్ చేసి పారిపోయాడు. అతి స‌మీపం నుంచి ఛాతీ ఎడ‌మ భాగంలో బుల్లెట్ దిగితే నేరుగా గుండెలోకి వెళ్లి చ‌నిపోవ‌డం ఖాయం. కానీ ఆమె చ‌నిపోలేదు! ఎందుకంటే అస‌లు ఆ బుల్లెట్ గుండెలోప‌లికి దిగ‌నే లేదు!

ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా! కానీ ఇది నిజం! ఆమె ఛాతీలోకి వెళ్లిన బుల్లెట్ నేరుగా గుండెలోకి దిగ‌కుండా కుడివైపున‌కు దిశ మార్చుకుని కుడి వ‌క్షో‌జంలోకి వెళ్లింద‌ట‌! దీంతో ఆమె బ‌తికి బ‌య‌ట‌ప‌డింద‌ట‌! మొత్తానికి ఆమె వ‌క్షోజాలే అమెను ర‌క్షించాయ‌న్న‌మాట‌! ఇంత‌వ‌ర‌కు బాగానే ఉందిగానీ బుల్లెట్ ఎందుకు దిశ మారింద‌నేగా సందేహం? ఎందుకంటే ఆ మ‌హిళ బ్రెస్ట్ ఇంప్లాట్ స‌ర్జ‌రీ చేయించుకున్న‌ద‌ట‌. ఛాతీ భాగం అందంగా క‌నిపంచ‌డం కోసం వ‌క్షోజాల్లో సిలికాన్ బెలూన్ల‌ను అమ‌ర్చుకోవ‌డాన్నే బ్రెస్ట్ ఇంప్లాంటేష‌న్ అంటారు. 

కాగా, మ‌హిళ‌పై కాల్పుల ఘ‌ట‌న 2018లో కెన‌డా రాజ‌ధాని టొరంటోలో జ‌రిగింది. మ‌రి ఇప్పుడెందుకు ఈ ప్ర‌స్తావ‌న వ‌చ్చిందంటే.. జియాన్ కార్లో మెక్ అవెన్యూ అనే ఒక ప్ర‌ముఖ స‌ర్జ‌న్ ఆ ఘ‌ట‌నపై కేస్ స్ట‌డీ చేశాడు. బ్రెస్ట్ ఇంప్లాంటేష‌న్ మ‌హిళ‌ను ప్రాణాల‌తో కాపాడింద‌ని గుర్తించి ఒక రిపోర్టు త‌యారుచేశాడు. ఆ ప‌రిశోధ‌నా ప‌త్రం తాజాగా సేజ్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురితం కావ‌డంతో ఈ విష‌యం ప్ర‌పంచం అంత‌టా వార్త‌ల్లోకి ఎక్కింది.   

ఇదిలావుంటే, అప్పుడు మ‌హిళ‌పై ఆగంత‌కుడు జ‌రిపిన‌ కాల్పుల్లో బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. దాంతో వాటిని తొల‌గించి మ‌ళ్లీ స‌ర్జ‌రీ చేశారు. అయితే, ఆ మ‌హిళ‌పై కాల్పులు జ‌రిపిన ఆగంత‌కుడు ఎవ‌రు, ఆమెపైనే ఎందుకు కాల్పులు జ‌రిపాడు అనే విష‌యం మాత్రం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే మిగిలిపోయింది. కాగా, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ మహిళ ప్రాణాలను కాపాడటం అనేది ఇప్పుడే తొలిసారని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo