ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 31, 2020 , 19:30:26

ఇంట‌ర్నెట్‌లో సంచ‌ల‌నం సృష్టించిన డౌన్ సిండ్రోమ్ బాయ్‌!

ఇంట‌ర్నెట్‌లో సంచ‌ల‌నం సృష్టించిన డౌన్ సిండ్రోమ్ బాయ్‌!

జోర్డాన్‌కు చెందిన ఆడమ్ మాజెన్ అనే 17 ఏండ్ల‌ బాలుడు ఇంటర్నెట్‌లో స్టీరియోటైప్‌లను బద్దలు కొడుతున్నాడు. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న అతను ఆన్‌లైన్‌లో సంచలనాన్ని సృష్టించాడు. అతను వీడియో-షేరింగ్ యాప్, టిక్‌టాక్‌లో ఫేమ‌స్. నిత్యం త‌న‌ వీడియోలను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అతని సోదరుడు మహ్మద్ మజెన్ అబూ ఆడ‌మ్ కెమెరాతో మాజెన్ వీడియోలు తీస్తుంటాడు. 

వీటితోపాటు మాజెన్ వంట ట్యుటోరియ‌ల్స్ కూడా చేస్తాడు. అతను తరచూ దేశమంతటా తిరిగి ప్రతి వివరాలను నమోదు చేస్తాడు. వాటిని మ‌ర‌లా డాక్యుమెంట్ చేస్తాడు. ఇంత‌కుముందు టిక్‌టాక్‌లో వైర‌ల్ అయ్యే కొన్ని ఫ‌న్నీ వీడియోలు కూడా చేస్తాడు. ఇత‌నికి ఏపీలో ఏకంగా 220,000 మంది అనుచరులను సంపాదించాడు. ఈ ప‌నులు చేసేట‌ప్పుడు అత‌నికి డౌన్ సిండ్రోమ్ ఉంద‌ని విష‌య‌మే ఎవ‌రూ గుర్తించ‌లేరు. మాజెన్‌కు తోడుగా అత‌ని కుటుంబం ఉంది. అత‌నికి కావాల్సిన మ‌ద్ద‌తు, ప్రేమ‌ను మేము ఎప్ప‌టికీ అందిస్తామంటున్నారు కుటుంబ స‌భ్యులు. logo