శనివారం 06 జూన్ 2020
International - Apr 08, 2020 , 09:53:35

హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ కోసం బ్రెజిల్ అభ్య‌ర్థ‌న‌

హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ కోసం బ్రెజిల్ అభ్య‌ర్థ‌న‌

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచదేశాల‌న్నిభార‌త్ వైపే చూస్తున్నాయి.  ప్ర‌పంచంలోని చాలా దేశాల‌కు హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మెడిసిన్ సప్లై అవ్వ‌డ‌మే ఇందుకు కార‌ణం. మ‌లేరియాను నివారించే  హైడ్రాక్సీ క్లోరోక్వినోన్  మెడిసిన్ కరోనా వైరస్ కు కూడా సమర్ధవంతంగా ఉపయోగపడుతున్నది. అయితే మార్చి 25 వ తేదీ నుంచి ఇండియా ఈ మెడిసిన్ పై ఆంక్షలు విధించింది. ఇక్క‌డ స‌రిప‌డినంత‌ మెడిసిన్ ను ఉంచుకున్న తరువాతే మిగతా దేశాలకు స‌ప్లై చేయాలని నిర్ణయం తీసుకుంది.  కానీ, అమెరికాతో పాటు ప‌లు దేశాల్లో క‌రోనాతో మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుండటంతో మానవతా దృక్పధంతో ఇండియా మెడిసిన్ ను సప్లై చేసేందుకు నిర్ణ‌యించింది. 

అమెరికా అభ్య‌ర్థ‌న‌తో కొంత ఆ దేశానికి స‌ప్లై చేస్తున్న‌ది భార‌త్‌. అయితే ఇప్పుడు అమెరికా బాటలోనే బ్రెజిల్ కూడా ఇండియాను అభ్యర్ధిస్తుంది. ఎంత‌లా అంటే బ్రెజిల్ ఏకంగా రామాయణంలో సంజీవిని ఘ‌ట్టాన్ని గుర్తుచేస్తూ రిక్వెస్ట్ చేసింది. హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చి ఎలాగైతే లక్ష్మణుడి ప్రాణాలు కాపాడాడో, ప్రధాని మోడీ కూడా హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ ను ఎగుమతి చేసి బ్రెజిల్ వాసుల ప్రాణాలు కాపాడాలని కోరారు.  బ్రెజిల్ ప్రెసిడెంట్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  logo