ఆదివారం 24 జనవరి 2021
International - Jan 09, 2021 , 12:02:52

టీకాలు త్వ‌ర‌గా పంపండి.. మోదీకి లేఖ రాసిన బ్రెజిల్ అధ్య‌క్షుడు

టీకాలు త్వ‌ర‌గా పంపండి.. మోదీకి లేఖ రాసిన బ్రెజిల్ అధ్య‌క్షుడు

రియో డిజ‌న‌రో :  ఆస్ట్రాజెన్‌కా త‌యారు చేస్తున్న కోవిడ్ టీకాల‌ను పుణెలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ టీకాల‌ను వీలైనంత త్వ‌ర‌గా త‌మ దేశానికి పంపించాలంటూ .. ప్ర‌ధాని మోదీకి  బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బోల్స‌నారో లేఖ రాశారు.  వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఆల‌స్యంగా జ‌రుగుతున్న‌ట్లు బ్రెజిల్‌లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  అధ్య‌క్షుడు బొల్స‌నారోపై వ‌త్తిడి పెర‌గ‌డంతో ఆయ‌న ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖ‌ను అధ్య‌క్ష భ‌వ‌న ప్రెస్ ఆఫీసు బ‌య‌ట‌కు రిలీజ్ చేసింది.  జాతీయ ఇమ్యూనైజేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాలంటే.. బ్రెజిల్‌కు మీరు వీలైనంత త్వ‌ర‌గా టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని, అయితే భార‌తీయ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియకు ఆటంకం క‌ల‌గ‌కుండా ఆ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని బొల్స‌నారో త‌న లేఖ‌లో ప్ర‌ధాని మోదీని కోరారు.  ఆస్ట్రాజెన్‌కా టీకాల స‌ర‌ఫ‌రా ఆల‌స్యం కానున్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో అధ్య‌క్షుడు బొల్స‌నారో లేఖ రాయాల్సి వ‌చ్చింది.     


logo