ఆదివారం 05 జూలై 2020
International - Jun 23, 2020 , 13:06:44

బ్రెజిల్‌లో 24 గంటల్లో 21,432 కరోనా కేసులు

బ్రెజిల్‌లో 24 గంటల్లో  21,432 కరోనా కేసులు

రియో డి జనీరో: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. రోజురోజుకీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.   బ్రెజిల్‌లో కొవిడ్-19 మహమ్మారి విలయ తాండవం చేస్తున్నది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 21,432 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఒక్కరోజే కరోనా బారినపడి 654 మంది చనిపోయారు. 

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,11,348కు చేరింది. ఇవాళ్టి వరకు బ్రెజిల్‌లో 51,271 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా(23,88,225 కేసులు) మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. 


logo