మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 12:21:35

బ్రెజిల్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం

బ్రెజిల్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం

బ్రెసీలియా: లాటిన్ అమెరిక‌న్ కంట్రీ బ్రెజిల్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. రోజూ 40 వేలు, 50 వేల చొప్పున కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం గురువారం రాత్రి నుంచి శుక్ర‌వార రాత్రి వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో అక్క‌డ‌ 50,163 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ దేశంలో న‌మోదైన‌ మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,91,801కి చేరింది. బ్రెజిల్ ఆరోగ్య‌శాఖ శుక్ర‌వారం రాత్రి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ఇక బ్రెజిల్‌లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా ప్ర‌తిరోజూ భారీగా న‌మోద‌వుతున్నాయి. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 888 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,25,502కు చేరింది. కాగా, అంత‌కుముందు రోజు కూడా బ్రెజిల్‌లో 834 క‌రోనా మ‌ర‌ణాలు, 43,773 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అమెరికా త‌ర్వాత అత్య‌ధికంగా క‌రోనా పాజిటివ్‌ కేసులు న‌మోదైన దేశం  బ్రెజిలే కావ‌డం గ‌మ‌నార్హం.           

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo