గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 03, 2020 , 07:23:41

బ్రెజిల్‌లో 94వేలకు చేరిన కరోనా మరణాలు

బ్రెజిల్‌లో 94వేలకు చేరిన కరోనా మరణాలు

బ్రెసిలియా : గత 24 గంటల్లో బ్రెజిల్‌లో 540 మందికిపైగా కరోనాతో మృతి చెందారు. ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. మృతుల సంఖ్య 94వేలకు చేరింది. ప్రస్తుతం 2,733,677 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని మంత్రిత్వశాఖ ఆదివారం పేర్కొంది. కొత్తగా 541 చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 94,104 చేరింది. శనివారం బ్రెజిల్‌లో 45,392 కేసులు నిర్ధారణ కాగా, 1,088 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందారు. వారం క్రితం కిందట 87వేలు ఉండగా, 7వేల మరణాలు ఒకే వారంలో సంభవించాయి. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 1.8 మిలియన్లకుపైగా ప్రజలు కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. శుక్రవారం, మెక్సికో కరోనా వైరస్ మరణాల సంఖ్యలో అమెరికాను అధిగమించగా, బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo