గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 11, 2020 , 16:27:47

బ్రెజిల్‌లో 1.5 ల‌క్ష‌లు దాటిన క‌రోనా చావులు

బ్రెజిల్‌లో 1.5 ల‌క్ష‌లు దాటిన క‌రోనా చావులు

బ్ర‌సీలియా: బ‌్రెజిల్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. అక్క‌డ‌ రోజూ 20 వేల‌కుపైగా కొత్త‌గా కేసులు న‌మోద‌వుతున్నాయి. శ‌నివారం ఉద‌యం నుంచి ఆదివారం ఉద‌యం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో బ్రెజిల్‌లో కొత్త‌గా 26,749 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ దేశంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 50,82,637కు చేరింది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా బ్రెజిల్‌లో భారీగా న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కూడా అక్క‌డ మొత్తం 559 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 

దీంతో బ్రెజిల్‌లో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య ల‌క్ష‌న్న‌ర మార్కును దాటి 1,50,198కి చేరింది. దీంతో ప్ర‌పంచంలో క‌రోనా మ‌ర‌ణాల ప‌రంగా చూసిన‌ప్పుడు బ్రెజిల్ రెండో స్థానంలో కొన‌సాగుతున్న‌ది. అగ్ర‌స్థానంలో అమెరికా ఉన్న‌ది. అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 2,14,366 క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo