శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 07:53:18

బ్రెజిల్‌లో మరణ మృదంగం

బ్రెజిల్‌లో మరణ మృదంగం

బ్రెసిలియా : బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. నిత్యం ఆ దేశంలో వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఆ దేశంలో 50,230 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య  2,962,442కు చేరిందని బ్రెజిల్‌ జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. మరో 1,079 మంది వైరస్‌తో చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 99,572 చేరింది. గురువారం, బ్రెజిల్‌లో 53,139 కొత్త కేసులు నిర్ధారణ కాగా, 1,237 కొత్త మరణాలు సంభవించాయి. 4.9 మిలియన్లకుపైగా కొవిడ్‌-19 కేసులు నమోదవగా.. యునైటెడ్ స్టేట్స్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల్లో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కరోనా వ్యాప్తిని ఒక మహమ్మారిగా ప్రకటించింది. ఈ రోజు వరకు, ప్రపంచవ్యాప్తంగా 19.1 మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారని, దాదాపు 7 లక్షల 12 వేల మంది కరోనాతో మృత్యువాతపడ్డారని అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo