మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Jul 25, 2020 , 07:43:17

బ్రెజిల్‌లో 23 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

బ్రెజిల్‌లో 23 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

బ్ర‌సిలియా: లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్‌లో క‌రోనా కేసులు రోజురోజుకు అధిక‌మ‌వుతున్నాయి. గురువారం రికార్డుస్థాయిలో 60 వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, నిన్న కేసుల తీవ్ర‌త కొంచం త‌గ్గింది. తాజాగా గ‌త 24 గంట‌ల్లో 55,891 క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. దీంతో దేశం‌లో ఇప్ప‌టివ‌ర‌కు 23,43,366 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. మొత్తం న‌మోదైన కేసుల్లో 15,90,264 మంది కోలుకున్నారు. శుక్ర‌వారం కొత్త‌గా 1156 మంది మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 85,238కి పెరిగింది. 

దీంతో ప్ర‌పంచంలో రోజువారీ అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాల‌తోపాటు మొత్తం కేసుల్లో కూడా అమెరికా త‌ర్వాత బ్రె‌జిల్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో గురువారం అత్య‌ధికంగా 59,661 కేసులు న‌మోద‌వ‌గా, 1311 మంది మ‌ర‌ణించారు. 


logo