సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 14, 2020 , 15:46:19

హ్యారీ పోటర్‌ బ్రూమ్‌స్టిక్‌ స్కూటర్‌ సిద్ధం

హ్యారీ పోటర్‌ బ్రూమ్‌స్టిక్‌ స్కూటర్‌ సిద్ధం

సావో పాలో: బ్రెజిలియన్ మెగాలోపాలిస్ సావో పాలో ఉక్కిరి బిక్కిరి చేసిన ట్రాఫిక్‌ వీధుల్లో ఇద్దరు యువకులు సునాయసంగా టార్గెట్‌ చేరుకునే నూతన మార్గాన్ని కనుగొన్నారు. వారు సిద్ధం చేసిన ఈ ప్రక్రియను చూసిన వారెవరైనా వావ్‌! అంటూ కనుబొమ్మలు ఎగురేయడం ఖాయం. ట్రాఫిక్‌ రద్దీ నుంచి బయటపడేందుకు హ్యారీ పోటర్‌ సినిమాలోని బ్రూమ్‌స్టిక్‌నే వాహనంగా మలిచి అబ్బురపరిచారు. వినాసియస్ శాంక్టస్, అలెశాండ్రో రస్సోలు నగరం ప్రధాన రహదారులపై చీపురుపై దూసుకుపోతుండటం చూసిన ప్రతి ఒక్కరూ వారిని అభినందించకుండా ఉండలేకపోయారు.

తాము తయారుచేసిన వాహనాన్ని 'బ్రూమ్‌స్టిక్ స్కూటర్' అని వీరు నామకరణం చేశారు. చీపురును ఒక మోటరైజ్డ్ చక్రంతో అనుసంధానించి ఈ వాహనాన్ని తయారుచేశారు. నగర రహదారుల గుండా వాహనం దూసుకుపోవడానికి బ్రూమ్‌ స్టిక్‌ స్టీరింగ్ వీల్‌గా ఉపయోగపడుతుననది. ఈ వాహనం ప్రయాణించే గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. రోజువారీ రాకపోకల అవసరాలను అనుకూలమైన పద్ధతిలో అందించేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు వారు చెప్పారు. తన స్నేహితులతో చీపురుతో వాహనం తయారుచేసి ప్రయాణించడం గురించి మాట్లాడినప్పుడు అవహేళన చేశారని, వారికి సమాధానంగా వినాసియన్‌తో కలిసి చీపురు స్కూటర్‌ను తయారుచేసినట్లు అలెశాండ్రో రస్సో తెలిపారు. ఇప్పుడు చీపురు స్కూటర్‌ను ఉపయోగించి దగ్గర్లో ఉన్న బేకరీకి మాత్రమే వెళ్లగలుగుతున్నానని, త్వరలో మరింత అభివృద్ధి పరిచి అందరికి ఉపయోగపడేలా తయారుచేసేందుకు కృషిచేస్తున్నాం అని అలెశాండ్రో రస్సో పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ వ్యక్తిగత వినియోగానికి ఎక్కువ కాలం పట్టదని, త్వరలో మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు పనిచేస్తున్నాం అని వినాసియన్‌ శాంక్టన్‌ చెప్పారు. ఈ చీపురు స్కూటర్లను 4000 రీయిస్‌కు విక్రయిస్తున్నారు, మన కరెన్సీ రూ.50,000 కన్నా ఎక్కువ.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.