మంగళవారం 07 జూలై 2020
International - May 26, 2020 , 15:10:34

అమెరికాలో లక్షకు చేరువలో కరోనా మరణాలు

అమెరికాలో లక్షకు చేరువలో కరోనా మరణాలు

లండన్‌:   ప్రపంచవ్యాప్తంగా 213 దేశాల్లో కరోనా అడుగుపెట్టింది. లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌లో కోవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతోంది.    ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా  17లక్షలకు పైగా కేసులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బ్రెజిల్‌, రష్యా, స్పెయిన్‌, బ్రిటన్‌ దేశాలు ఉన్నాయి. భారత్‌ పదో స్థానంలో ఉంది. 

అమెరికాలో కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ప్రస్తుతం ఆ దేశంలో మృతుల సంఖ్య 99,805కు చేరింది. ఆ తర్వాత  బ్రిటన్‌(36,914), ఇటలీ(32,877), స్పెయిన్‌(26,837) దేశాల్లో కరోనా వల్ల ఎక్కువగా మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు 348,221 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితా ఇదే..

అమెరికా(1,706,226 కేసులు)

బ్రెజిల్‌(376,669)

రష్యా(362,342)

స్పెయిన్‌(282,480)

బ్రిటన్‌(261,184)

ఇటలీ(230,158)

ఫ్రాన్స్‌(182,942)

జర్మనీ(182,942)

టర్కీ(157,814)

భారత్‌(145,456)


logo