బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 09, 2020 , 11:38:15

బ్రెజిల్‌లో ల‌క్ష‌ దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

బ్రెజిల్‌లో ల‌క్ష‌ దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

రియో డీ జెనీరో: ద‌క్షిణ అమెరికా దేశమైన‌ బ‌్రెజిల్‌లో క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండవం చేస్తున్న‌ది. దేశంలో మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో దేశంలో పాటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉన్న‌ది. ఈ ప్రాణాంత‌క వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు ల‌క్ష‌కు పైగా బాధితులు చ‌నిపోగా, మొత్తం కేసులు 30 ల‌క్ష‌లు దాటాయి. 

దేశంలో గ‌త 24 గంట‌ల్లో 49,907 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, కొత్త‌గా 905 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసులు 30,12,412కు చేరాయి. క‌రోనా వ‌ల్ల 1,00,477 మంది బాధితులు మ‌ర‌ణించారు. 

దేశంలో మొద‌టి క‌రోనా కేసు ఫిబ్ర‌వ‌రి 26న సావ్ పౌలోలో న‌మోద‌వ‌గా, మొద‌టి మ‌ర‌ణం మార్చి 12న అదే ప‌ట్ట‌ణంలో చోటుచేసుకున్న‌ది. మొత్తంగా ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందిలో 478 మంది క‌రోనా వేర‌స్ వ‌ల్ల చ‌నిపోతున్నారు. ఈ సంఖ్య అమెరికాలో 487గా ఉండ‌గా, స్పెయిన్‌లో 609, ఇంట‌లీలో 583గా ఉన్న‌ది. అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న దేశాల్లో అమెరికా త‌ర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్న‌ది.   


logo