సోమవారం 08 మార్చి 2021
International - Jan 15, 2021 , 16:26:37

బ్రెజిల్‌కు ఇప్పుడే వ్యాక్సిన్‌ ఎగుమతి చేయలేం:భారత్‌

బ్రెజిల్‌కు ఇప్పుడే వ్యాక్సిన్‌ ఎగుమతి చేయలేం:భారత్‌

న్యూఢిల్లీ: త్వరితగతిన కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలని బ్రెజిల్‌ తహతహలాడుతున్నది. అందుకోసం 20 లక్షల కొవిడ్‌-19 వ్యాక్సిన్ల కోసం ప్రత్యేకమైన కంటైనర్లు ఏర్పాటు చేసిన విమానాన్ని భారత్‌కు పంపినట్లు ప్రకటించింది. ఇందుకోసం ఎయిర్‌బస్‌ ఏ330 నియో విమానాన్ని పంపినట్లు తెలిపింది. ముంబైలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) నుంచి 20 లక్షల డోసులతో సదరు విమానం ఈ నెల 16కల్లా దేశానికి తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించింది. దీనిపై భారత్‌ గురువారం స్పష్టమైన వివరణ ఇచ్చింది. విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి చేసే విషయమై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని పేర్కొంది. 

బ్రెజిల్‌ సహా విదేశాలకు ఎటువంటి వ్యాక్సిన్లను ఎగుమతి చేయడానికైనా నిర్దిష్ట టైం ఫ్రేం అవసరం అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, అన్ని దేశాలూ వ్యాక్సిన్‌ పొందేందుకు ప్రపంచానికి చేయూతనివ్వాలన్న నిర్ణయానికి భారత్‌ కట్టుబడి ఉన్నట్లు ఆ వర్గాల కథనం. 

భారత ప్రధాని నరేంద్రమోదీకి బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో ఈ నెల ఎనిమిదో తేదీన లేఖ రాశారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ), ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ 20 లక్షల డోసులు పంపాలని ఆ లేఖలో కోరారు. బ్రెజిల్‌లోని విపక్షాల నుంచి దేశ ప్రజలకు వ్యాక్సినేషన్‌ కోసం చర్యలు తీసుకోవాలని బొల్సోనారోపై తీవ్రమైన ఒత్తిడి వస్తున్నది. దీనికి అనుగుణంగానే సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి తమ ఆరోగ్యశాఖ వ్యాక్సిన్‌ డోసులను కొనుగోలు చేసిందని బ్రెజిల్‌ విదేశాంగశాఖ తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo