శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 08:14:09

బ్రెజిల్‌లో 20 లక్ష‌లు దాటిన క‌రోనా కేసులు

బ్రెజిల్‌లో 20 లక్ష‌లు దాటిన క‌రోనా కేసులు

బ్ర‌సిలియా: బ్రెజిల్‌లో క‌రోనా కేసులు ఇర‌వై ల‌క్ష‌లు దాటాయి. దేశంలో గురువారం కొత్త‌గా 43,829 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,14,738కి చేరింది. నిన్న ఒకేరోజు 1,299 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మ‌ర‌ణాలు 76,822కు పెరిగాయి. దేశంలో మొద‌టి క‌రోనా కేసు మే నెల‌లో న‌మోద‌య్యింది. కేవ‌లం మూడు నెల‌ల్లోనే ఈ సంఖ్య 20 లక్ష‌లు దాటింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 571141 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 13,26,775 మంది కోలుకున్నారు. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1,39,46,596 కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 5,92,677 మంది మ‌ర‌ణించారు. మ‌రో 82,77,732 మంది కోలుకోగా, 50,76,187 మంది చికిత్స పొందుతున్నారు. 


logo