శనివారం 30 మే 2020
International - Apr 19, 2020 , 06:38:12

బ్రెజిల్‌లో 36 వేలు దాటిన కోవిడ్‌-19 కేసులు

బ్రెజిల్‌లో 36 వేలు దాటిన కోవిడ్‌-19 కేసులు

బ్రెజిల్‌ : కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన విషయం తెలిసిందే. బ్రెజిల్‌లో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 36 వేలు దాటింది. కోవిడ్‌-19 కారణంగా బ్రెజిల్‌లో ఇప్పటివరకు 2,347 మంది మృత్యువాతపడ్డారని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,917 కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్‌-19 కేసుల సంఖ్య దేశంలో 36,599 కు చేరుకుంది. మొత్తం కేసుల్లో మరణాల సంఖ్య 6.4 శాతంగా ఉందని పేర్కొన్నారు. బ్రెజిల్‌లోని సావో పాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఇక్కడ 13,894 మంది కోవిడ్‌-19 వ్యాధి భారిన పడ్డట్లు ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.


logo