శనివారం 11 జూలై 2020
International - May 30, 2020 , 13:00:45

కరోనా మృతుల్లో ఐదో స్థానానికి బ్రెజిల్‌

కరోనా మృతుల్లో ఐదో స్థానానికి బ్రెజిల్‌

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల్లో రెండో స్థానంలో ఉన్న లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌.. కరోనా మృతుల్లో ఐదోస్థానానికి చెరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 27,944 మంది బాధితులు మరణించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన ఐదో దేశంగా నిలిచింది. బ్రెజిల్‌లో గత 24 గంటల్లో 1124 మంది మరణించగా, కొత్తగా 26,928 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో అమెరికాలో 1,04,542 మంది మరణించగా, ఇటలీలో 33,229 మంది, యూకేలో 38,161 మంది బాధితులు, స్పెయిన్‌లో 27,121 మంది, బ్రెజిల్‌లో 27,944 మంది మృతిచెందారు.  

బ్రెజిల్‌లో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు కావ్‌పోలో నగరంలో నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 1,01,556 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 7275 మంది బాధితులు మరణించారు. రియో డీ జెనీరో, సియెర్రాల్లో కూడా ఎక్కువ మొత్తంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.    

కరోనా కేసుల్లో అగ్రస్థానంలో అమెరికా కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటివరకు 17,93,530 పాజిటివ్‌ కేసులు నమోదవగా, రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్‌లో 4,68,338 కరోనా కేసులు నమోదయ్యాయి.


logo