ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 31, 2020 , 09:13:51

బ్రెజిల్ ప్రెసిడెంట్ భార్య‌కు క‌రోనా పాజిటివ్

బ్రెజిల్ ప్రెసిడెంట్ భార్య‌కు క‌రోనా పాజిటివ్

బ్రెజిల్ : బ‌్రెజిల్ అధ్య‌క్షుడు జైర్ బోల్సోన‌రో భార్య మిచ్చెల్లికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ప్రెసిడెంట్ ఆఫీస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మిచ్చెల్లితో పాటు సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రి మాక్రోస్ పొనెట్స్ కూడా క‌రోనా వ్యాప్తి చెందింది. 

మిచ్చెల్లి ఆరోగ్య‌క‌రంగా ఉన్నార‌ని, కొవిడ్ నివార‌ణ జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నార‌ని అధికారులు తెలిపారు. బ్రెజిల్ అధ్య‌క్షుడికి కూడా క‌రోనా సోకింది. ఆయ‌న కొన్ని వారాల పాటు క్వారంటైన్ లో ఉన్నారు. అనంత‌రం టెస్టులు చేయ‌గా క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. 

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్ లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.5 మిలియ‌న్ల‌కు చేరగా, 90 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బుధ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 69,074 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 1,595 మంది చ‌నిపోయారు. 


logo