బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 07, 2020 , 22:02:36

బ్రెజిల్‌ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌

బ్రెజిల్‌ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌

బ్రసిలియా: కరోనా మహమ్మారి దేశాధినేతలనూ వదిలిపెట్టడం లేదు. తాజాగా, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో(65)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మంగళవారం ఆయన స్వయంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను బాగానే ఉన్నానని, మధ్యస్థంగా కరోనా లక్షణాలున్నాయని పేర్కొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తోపాటు అజిత్రోమైసిన్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నట్లు చెప్పారు. 

ఆదివారం తాను అస్వస్థతకు లోనయ్యాయని, సోమవారం పరిస్థితి మరింత తీవ్రవమైందని, అలసట, జ్వరంతో బాధపడ్డట్లు తెలిపారు. కానీ, ఇప్పుడు ప్రశాంతంగానే, బాగానే ఉన్నానని ‌మాస్క్‌ తీసి మరీ చెప్పారు. కాగా, శనివారం బోల్సోనారో సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఇందులో అతడు జూలై 4 సెలవుదినం సందర్భంగా అమెరికా రాయబారి, పలువురు మంత్రులతో కలిసి భోజనం కూడా చేశాడు. చాలా సందర్భాల్లో మాస్కు కూడా ధరించలేదు. ఇదిలా ఉండగా, ప్రపంచంలోనే కరోనా కేసుల్లో బ్రెజిల్‌ అమెరికా తర్వాతి స్థానంలో నిలిచింది. మొదట్లో బోల్సోనారో కరోనాను లైట్‌గా తీసుకున్నాడనే ఆరోపణలున్నాయి. మాస్కు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడాన్ని ఆయన పట్టించుకోలేదు. ఇప్పటివరకూ మూడుసార్లు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా, రెండుసార్లు నెగెటివ్‌ వచ్చింది. మూడోసారి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం.

 


తాజావార్తలు


logo