గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 08:46:23

బ్రెజిల్ అధ్య‌క్షుడు బోల్సొనారోకు మరోమారు క‌రోనా పాజిటివ్‌

బ్రెజిల్ అధ్య‌క్షుడు బోల్సొనారోకు మరోమారు క‌రోనా పాజిటివ్‌

బ్రసిలియా: బ్రెజిల్ అధ్య‌క్షుడు జైర్ బోల్సొనారోకు మ‌రోమారు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో తాను బ్ర‌సిలియాలోని అధికార నివాసంలో నిర్బంధంలోనే ఉంటాన‌ని వెల్ల‌డించారు. అక్క‌డి నుంచే అధికార కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తాన‌ని ప్ర‌క‌టించారు. 65 ఏండ్ల బోల్సొనారోకు జూలై 7న క‌రోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు.   

జూలై 6 నుంచి త‌న‌కు జ్వ‌రం, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల వంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని తెలిపారు. తాను మ‌లేరియా  నిరోధ‌క ఔష‌ధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నాన‌ని చెప్పారు. బ్రెజిల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 1.9 మిలియ‌న్ల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 74 వేల మంది మ‌ర‌ణించారు.  


logo