ఆదివారం 17 జనవరి 2021
International - Nov 27, 2020 , 13:01:50

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోను: బ్రెజిల్ అధ్య‌క్షుడు

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోను: బ్రెజిల్ అధ్య‌క్షుడు

హైద‌రాబాద్‌: ఒక‌వేళ కోవిడ్ వ్యాక్సిన్ వ‌స్తే, దాన్ని తాను తీసుకోవ‌డం లేద‌ని బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో తెలిపారు.  క‌రోనా వైర‌స్ టీకా కోసం జ‌రుగుతున్న ప్రోగ్రామ్‌ల‌ను అధ్య‌క్షుడు బొల్స‌నారో త‌ప్పుప‌ట్టారు. బ్రెజిల్ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న అభిప్రాయాలు ఆ దేశ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం సాగుతున్నాయి. ప్ర‌పంచవ్యాప్తంగా కోవిడ్ వ‌ల్ల‌ అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌వించిన జాబితాలో బ్రెజిల్ రెండ‌వ స్థానంలో ఉన్న‌ది.  వైర‌స్ సోకినా ఆయ‌న మాత్రం మ‌హ‌మ్మారితో ప్ర‌మాదం లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు.  నేను మీకో విష‌యం చెబుతున్నాను, నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవ‌డంలేద‌ని, అది నా హ‌క్కు అని బొల్స‌నారో అన్నారు. త‌న వ‌ద్ద ఉన్న పెంపుడు కుక్క‌కు మాత్రం వ్యాక్సిన్ ఇప్పిస్తాన‌ని అక్టోబ‌ర్‌లో బొల్స‌నారో ఓ జోక్ చేశారు.