శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 23, 2021 , 10:19:06

20 ల‌క్ష‌ల టీకాలు పంపిన భార‌త్‌.. ధ‌న్యవాదాలు చెప్పిన బొల్స‌నారో

20 ల‌క్ష‌ల టీకాలు పంపిన భార‌త్‌.. ధ‌న్యవాదాలు చెప్పిన బొల్స‌నారో

రియో: మేడిన్ ఇండియాలో భాగంగా త‌యారైన కోవీషీల్డ్ టీకాలు బ్రెజిల్ చేరుకున్న‌ట్లు కేంద్ర విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్ త‌న ట్వీట్‌లో తెలిపారు.  20 ల‌క్ష‌ల డోసుల టీకాల‌ను బ్రెజిల్‌కు ఇండియా పంపించింది.  ఈ నేప‌థ్యంలో బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.  వ్యాక్సిన్లు ఎగుమ‌తి చేసిన ఇండియాకు ఆయ‌న థ్యాంక్స్ చెప్పారు. ప్ర‌పంచం విపత్తు ఎదుర్కొంటున్న స‌మ‌యంలో భార‌త్ లాంటి గొప్ప మిత్ర‌దేశాన్ని క‌లిగి ఉండ‌డం గ‌ర్వంగా భావిస్తున్న‌ట్లు బొల్స‌నారో తెలిపారు.  వ్యాక్సిన్లు ఎగుమతి చేసిన భార‌త్‌కు బొల్స‌నారో ధ‌న్య‌వాదాలు చెప్పారు.  ఆరోగ్య‌ర‌క్ష‌ణ రంగంలో తాము మ‌రింత స‌హ‌కారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  కోవిడ్‌19 పోరాటంలో బ్రెజిల్ న‌మ్మ‌క‌మైన భాగ‌స్వామ‌ని అని,  ఆ దేశానికి స‌హ‌క‌రించ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు మోదీ తెలిపారు.  ఆక్స్‌ఫ‌ర్డ్‌, ఆస్ట్రాజెన్‌కా డెవ‌ల‌ప్ చేసిన కోవీషీల్డ్ టీకాల‌ను సీరం సంస్థ ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. సుమారు రెండు మిలియ‌న్ల డోసుల టీకాల‌ను బ్రెజిల్‌కు భార‌త్ స‌ర‌ఫ‌రా చేసింది. 

VIDEOS

logo