శుక్రవారం 05 జూన్ 2020
International - May 04, 2020 , 10:06:15

బ్రెజిల్‌లో ల‌క్ష దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య‌

బ్రెజిల్‌లో ల‌క్ష దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య‌

హైద‌రాబాద్‌: బ్రెజిల్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య ల‌క్ష దాటింది.  ప్ర‌స్తుత సంఖ్య 101,147గా ఉన్న‌ది. ఆ దేశంలో వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడు వేలుగా ఉన్న‌ది.  ఒక‌వైపు మ‌ర‌ణాలు పెరుగుతున్నా.. అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో మాత్రం విచిత్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న క‌ఠిన ఆంక్ష‌ల‌ను ఆయ‌న త‌ప్పుప‌డుతున్నారు.  ఆరోగ్య‌శాఖ వారి ఇస్తున్న స‌ల‌హాల‌ను కూడా ఆయ‌న వ్య‌తిరేకిస్తున్నారు. ఉద్యోగాలు తీసివేయ‌డాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రోజూ వైర‌స్ సంక్ర‌మ‌ణ కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ద‌క్షిణ అమెరికాలో రానున్న రోజుల్లో వైర‌స్ కేసులు అధిక స్థాయికి చేర‌నున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. logo