శనివారం 06 జూన్ 2020
International - May 24, 2020 , 01:10:06

చర్చిలు అత్యవసరం.. తెరవండి: ట్రంప్‌

చర్చిలు అత్యవసరం.. తెరవండి: ట్రంప్‌

వాషింగ్టన్‌: చర్చిలు ‘అత్యవసరమైనవని’, వాటిని వెంటనే తెరువాలని అమెరికాలోని అన్ని రాష్ర్టాల గవర్నర్లకు అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు. రెండు నెలల షట్‌డౌన్‌ అనంతరం అమెరికాలోని దాదాపు అన్ని రాష్ర్టాలు ఆంక్షల ఎత్తివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. చివరిగా బుధవారం కనెక్టికట్‌ రాష్ట్రం కూడా పలు ఆంక్షలను సడలించింది. 

కరోనా కేసుల్లో రెండోస్థానానికి బ్రెజిల్‌ 

కరోనా కేసుల నమోదులో బ్రెజిల్‌ శుక్రవారం రష్యాను దాటేసి రెండో స్థానాన్ని ఆక్రమించింది. బ్రెజిల్‌లో మొత్తం 3.30 లక్షల కేసులు, 21 వేల మరణాలు నమోదయ్యాయి. మరో లాటిన్‌ అమెరికా దేశం మెక్సికోలో కేసులు 60 వేలు, మరణాలు 6,500 దాటాయి. లాక్‌డౌన్‌ సడలించడమే నష్టానికి కారణ మని తెలుస్తున్నది. చైనాలో తొలిసారి శుక్రవారం కొత్త కేసు నమోదు కాలేదు. 


logo