ఆదివారం 31 మే 2020
International - Apr 25, 2020 , 12:49:59

క‌రోనా హాట్‌స్పాట్‌గా బ్రెజిల్‌..

క‌రోనా హాట్‌స్పాట్‌గా బ్రెజిల్‌..


హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌కు లాటిన్‌ హాట్‌స్పాట్‌గా బ్రెజిల్ మారుతున్న‌ది. ఆ దేశంలో కొత్త‌గా వైర‌స్ సంక్ర‌మించిన కేసులు పెరుగుతున్నాయి. దీంతో హాస్పిట‌ళ్లకు వ‌స్తున్న వారి సంఖ్య రెట్టింపు అయ్యింది. ఇక చ‌నిపోయిన‌వారితో మార్చురీలు, స్మ‌శాన‌వాటిక‌లు నిండిపోతున్నాయి.  లాటిన్ దేశాల్లో అత్య‌ధిక సంఖ్య‌లో బ్రెజిల్‌లోనే కేసులు న‌మోదు అయ్యాయి.  రియో డిజ‌నారోతో పాటు మ‌రో నాలుగు నగ‌రాల్లో ఉన్న ప్ర‌ధాన హాస్పిట‌ళ్లు అన్ని పేషెంట్ల‌తో కిక్కిరిసిపోయిన‌ట్లు వైద్య అధికారులు ప్ర‌క‌టించారు. ఇక ఆ ద‌వాఖానాలు కొత్త పేషెంట్ల‌ను తీసుకునే అవ‌కాశం లేకుండా ఉన్న‌ది. బ్రెజిల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల సుమారు 3313 మంది చ‌నిపోయారు. గ‌త 24 గంట‌ల్లో సుమారు 407 మంది క‌రోనాతో మృతిచెందారు. దేశ‌వ్యాప్తంగా దాదాపు 50 వేల మందికి వైర‌స్ సంక్ర‌మించింది.logo