సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 19, 2020 , 20:07:38

నాలుగో కొవిడ్‌ టీకా చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు బ్రెజిల్‌ ఆమోదం

నాలుగో కొవిడ్‌ టీకా చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు బ్రెజిల్‌ ఆమోదం

రియోడిజనీరో: ప్రసిద్ధ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌--19 టీకా చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అనుమతి ఇచ్చినట్లు బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్లు తెలిపారు. కొవిడ్‌తో తీవ్రంగా దెబ్బతిన్నఆ దేశంలో విస్తృతంగా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుకున్న నాలుగో టీకా ఇది. యూఎస్  ఫార్మాస్యూటికల్ కంపెనీ అనుబంధ సంస్థ జాన్సన్‌ బ్రెజిల్‌లోని ఏడు రాష్ట్రాల్లోని 7,000 మంది వలంటీర్లకు టీకా ఇవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా  60,000 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.  

‘బ్రెజిల్‌లో మరో టీకా అధ్యయనం ఆమోదించబడింది. ఇది చాలా ముఖ్యమైన పరిణామం.’ బ్రెజిల్‌ ఆరోగ్య అధికారి గుస్తావో మెండిస్ తెలిపారు. కాగా, బ్రెజిల్‌ మరో మూడు టీకాల మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు కూడా ఆమోదం తెలిపింది. ప్రసిద్ధ ఔషధ సంస్థ ఆస్ట్రాజెన్‌కాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృద్ధి చేసిన, చైనా ఔషధ సంస్థ సినోవాక్‌ బయోటెక్‌, యూఎస్‌ ఔషధ సంస్థ ఫైజర్‌, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి రూపొందించిన టీకాల క్లినికల్‌ ట్రయల్స్‌ చివరి దశల్లో ఉన్నాయి. అలాగే, రష్యా టీకా స్పుత్నిక్‌ వీని పరీక్షించి ఉత్పత్తి చేయడానికి బ్రెజిల్‌ రాష్ట్రమైన పరానా గతవారం ఒప్పందం చేసుకుంది.  


logo